ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు విశాల్‌ నామినేషన్

SMTV Desk 2017-12-04 17:48:23  hero vishal, RK nagar by election, independent candidate

చెన్నై, డిసెంబర్ 04 : యువ నటుడు విశాల్‌ ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న విశాల్ సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇటీవల తమిళ రైతులు ఆందోళన చేపట్టిన సమయంలో ఢిల్లీ వెళ్లి వారికి మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. నామినేషన్‌కు ముందు విశాల్‌.. అలనాటి నటులు శివాజీ గణేశన్‌, ఎంజీ రామచంద్రన్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ఎన్నికను డిసెంబర్‌ 21న నిర్వహించనున్నారు.