శైలజను పరామర్శించిన చైర్‌పర్సన్‌ నన్నపనేని

SMTV Desk 2017-12-04 16:33:13  AP The chairperson of Nannapaneni rajakumari, sailaja

చిత్తూరు, డిసెంబర్ 04 : వివాహమైన 24 గంటలలోపే భర్త చేతిలో అతి కిరాతకంగా గాయాలపాలైన శైలజ ప్రస్తుతం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి నేడు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులను శైలజ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకుమారి మాట్లాడుతూ.. శైలజపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు.