బాల్యవివాహాన్ని ఆపేసిన యాప్...

SMTV Desk 2017-12-04 16:19:21  Bandhan Todd, Mobile app, child marriage, bihar.

పట్నా, డిసెంబరు 4 : ఓ మైనర్ బాలికకు బాల్య వివాహం జరిపించాలని చూశారు. కాని ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా ఆ బాలిక వివాహం ఆగిపోయిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పట్నాకు చెందిన జెండర్‌ అలయన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ "బంధన్‌ టాడ్" అనే పోరుతో ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ లో బాల్య వివాహాలతో సహా వరకట్న వేధింపులు, గృహహింస, లింగ వివక్షకు గురయ్యే వారు ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఈ తరుణంలో తనకు ఇష్టం లేకుండా తన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని 13 ఏళ్ల బాలిక " బంధన్‌ టాడ్" లో మెసేజ్ పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి బాధిత బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వరుడు కూడా మైనరే (15). దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆ పెళ్లిని ఆపేశారు.