చాబహర్‌ పోర్ట్‌ ను ప్రారంభించిన ఇరాన్‌ అధ్యక్షుడు

SMTV Desk 2017-12-04 16:03:39  Chhabar port, Iranian President Hassan Rouhouni, Union Minister Pon Radhakrishnan

చాబహర్‌(ఇరాన్‌), డిసెంబర్ 04: చైనా, పాకిస్థాన్‌కు చెక్‌ పెట్టేందుకు భారత్‌ ఈ చాబహర్‌ పోర్ట్‌ ను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహౌనీ ఆదివారం దీన్ని ప్రారంభించారు. భారత్‌ తరఫున కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలిదశ చాబహార్‌ పోర్ట్‌ను షాహిద్‌ బెహెస్తీ పోర్ట్‌గా వ్యవహరిస్తారు. తమ భూభాగం గుండా భారత్‌- అఫ్గాన్‌ మధ్య వాణిజ్య రవాణాకు పాక్‌ అవరోధాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలకు ఈ పోర్ట్‌ చాలా కీలకం. పాకిస్థాన్‌లో చైనా నిర్మించిన గ్వదర్‌ పోర్ట్‌కు ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 17 దేశాల నుంచి వచ్చిన 60 మంది ప్రతినిధుల సమక్షంలో ఈ పోర్ట్‌ను ప్రారంభించారు.