పాపికొండలలో మళ్లీ పర్యాటకుల సందడి

SMTV Desk 2017-12-04 15:47:13  Papikondalu, Travel again, East Godavari District

వీఆర్‌ పురం, డిసెంబర్ 04 : మళ్లీ పాపికొండల వద్ద పర్యాటకుల సందడి చిగురించింది. ఇటీవల కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు వారాలుగా అధికారులు లాంచీలకు అనుమతులు నిలిపివేసింది. అయితే, తనిఖీల అనంతరం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న లాంచీలు, బోట్లకు అధికారులు విడతల వారిగా అనుమతులు ఇచ్చారు. దీంతో పర్యాటకుల రాక తిరిగి ప్రారంభమైంది. శని, ఆదివారాల్లో వెయ్యిమందికి పైగా పర్యాటకులు రావడంతో తూర్పుగోదావరి జిల్లాలోని పోచవరం బోట్‌ పాయింట్, పేరంటపల్లి శివాలయం, కొల్లూరు ఇసుకతిన్నెల్లో సందడి వాతావరణం కనిపిందింది.