ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..!

SMTV Desk 2017-12-04 15:21:24  Central budget, february 1, Finance Minister Arun Jaitley

న్యూఢిల్లీ, డిసెంబర్ 04 : కేంద్ర బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశ పెడతామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసిన తర్వాత ప్రవేశ పెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే కావడంతో బడ్జెట్‌ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత ఈ బడ్జెట్ సమావేశాలు 2018 జనవరి 30 వ తేదీన ప్రారంభ౦ కానున్నాయి. కాగా మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టం ఇదే చివరి సారి కావడం గమనార్హం.