నేడు విశాఖలో నౌకాదళ విన్యాసాల ప్రదర్శన

SMTV Desk 2017-12-04 15:15:00  navy day , celebrations, vishakhapatam, beach

విశాఖపట్నం, డిసెంబర్ 04 : 1971 యుద్దంలో పాక్‌పై విజయం సాధించిన భారత నౌక దళం గుర్తుగా విశాఖలో విజయస్థూపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నేడు నౌకాదళ దినోత్సవం కావడంతో ఈ యుద్ధ స్మారకం వద్ద తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌ ఘన నివాళులర్పించారు. అనంతరం కరంబీర్‌సింగ్‌ నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌, పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ పాల్గొని పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అంతేకుండా ఆర్కే బీచ్‌లో సాయంత్రం 4 గంటల నుంచి నౌకాదళ విన్యాసాల ప్రదర్శనలున్నాయి.