కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ విద్యుత్‌దీపాల ప్రదర్శన

SMTV Desk 2017-12-04 14:50:34  Hong Kong, Electric lighting display

హాంకాంగ్, డిసెంబర్ 04 ‌: రానున్న కొత్త సంవత్సరానికి గాను హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాల ప్రదర్శన పర్యాటకులని ఆకర్షిస్తుంది. హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌ సమీపంలో ఉన్న 40 ఆకాశవీధిలో రంగురంగుల దీపాలు క్రమపద్ధతిలో వెలుగులు విరజిమ్ముతున్న దృశ్యాలు స్థానికులు, పర్యటకులను కట్టిపడేస్తున్నాయి. సెర్చ్‌లైట్లు, లేజర్లు, ఎల్‌ఈడీలను ఉపయోగించి రోజూ సాయంత్రం 15 నిమిషాల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నెలాఖరువరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనతో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతుంది.