పొట్టి ఎస్‌ఎమ్‌ఎస్‌ @ పాతికేళ్లు

SMTV Desk 2017-12-04 12:54:22  SHORT SMS, 25 YEARS, Richard Jarvis ENGINEER.

న్యూఢిల్లీ, డిసెంబర్ 04 : ప్రపంచంలోనే మొదటి పొట్టి ఎస్‌ఎమ్‌ఎస్‌కు పాతికేళ్లు నిండాయి. నీల్‌ పాప్‌వర్త్‌ అనే ఇంజినీర్ మొదటిసారి వొడాఫోన్‌ నెట్‌వర్క్‌పై అప్పటి వొడాఫోన్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ జార్విస్‌కు "మేరీ క్రిస్మస్‌" అంటూ ఒక సందేశాన్ని పంపించాడు. ఆ తర్వాత 160 అక్షరాల పరిమితితో ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపగలిగే సాంకేతికత నోకియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఏ నెట్‌వర్క్‌ వారైన సంక్షిప్త సందేశాలు పంపే సదుపాయం 1999 లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ వాట్సాప్‌, మెసెంజర్ వంటి సదుపాయాలు వచ్చాక పొట్టి సందేశాలతో పాటు దాదాపు రెండు వేల పదాలతో మెసేజ్ లను ప౦పుకునే సౌలభ్య౦ కొనసాగుతోంది.