చిత్తశుద్ధితో పరిష్కారం సఫలం :సీఎం

SMTV Desk 2017-12-04 12:08:50  Kapu reservation, cm chandrababu naidu, amravathi

అమరావతి, డిసెంబర్ 04 : ఏ వర్గానికి అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్ కల్పించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుధ్ఘాటించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్ ను చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. తెలుగు దేశం ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం బీసీ కమిషన్ లోని మెజార్టీ సభ్యుల ఆధారంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారమే బిల్లును సభలో ప్రవేశపెట్టమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టడంలేదని ముందు నుంచి చెప్పినట్లే నడుచుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. కాపు బిల్లు తరువాత జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించాలని టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని తెలుగుదేశం హయంలోనే బీసీల అభ్యున్నతి జరిగిన విషయం మరువరాదన్నారు. బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య విమర్శలను నాయకులూ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదని నేతలు ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు బీసీ సంఘాల ఆందోళన మంజునాథ కమిషన్ వివాదంపై తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఈ వ్యవహారం పై అందరినీ సమన్వయం చేసే బాధ్యతలను కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్‌లకు అప్పగించారు.