ఆగిన ఆగునంగ్ అగ్ని పర్వతం

SMTV Desk 2017-12-04 11:12:54  Aganganag volcano, Airlines service, Indonesia

ఇండోనేసియా, డిసెంబర్ 04 : గతవారం ఆగునంగ్ అగ్ని పర్వతం బద్దలు కాగా బూడిద విపరీతంగా ఆకాశంలోకి వస్తుండడంతో పలు విమానయాన సంస్థలు సర్వీసులను నిలిపివేశాయి. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. బూడిద ప్రభావం తగ్గిన తర్వాత కానీ సర్వీసులను పునరుద్ధరించలేమని పేర్కొన్నాయి. ప్రస్తుతం బూడిద తగ్గడంతో నేటి నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని భావిస్తున్నాయి. మరోవైపు అగ్నిపర్వతం కారణంగా ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం పేర్కొంది. అయితే, పర్యాటకులందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ‘ఎక్స్‌క్లూజన్ జోన్‌’ పరిధిని పది కిలోమీటర్లకు పెంచినట్టు పేర్కొంది. ప్రస్తుతం 55 వేల మంది శిబిరాల్లో ఉన్నట్టు వివరించింది. ఆకాశంలోకి బూడిద పెద్ద ఎత్తున ఎగిరిపడుతుండడంతో జెట్‌స్టార్, వర్జిన్ ఆస్ట్రేలియా వంటి విమానయాన సంస్థలు వారం పాటు తమ సర్వీసులను నిలిపివేశాయి.