హైదరాబాద్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

SMTV Desk 2017-06-15 12:57:25  Kailasagiri, Mallapur, Ramnagar,This month 16,Minister Ketiar to visit

హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర కైలాసగిరి, మల్లాపూర్‌లో పూర్తి చేసు కున్న మంచినీటి రిజర్వాయర్లను ఈ నెల 16వ తేదిన ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు డివిజన్ కార్పొరేటర్లు పన్నాల దేవేం దర్‌రెడ్డి, గొల్లూరి అంజయ్యలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వాయర్లతో రెండు డివిజన్ల పరిధి లో మంచినీటి సమస్య పూర్తిగా తీరనున్నట్లు తెలిపారు. అదేవిధంగా డివిజన్ల పరిధిలో మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలో ఇంటింటికి మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్కడి నుండి రాంనగర్ లోని లంబాడ తండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఐటీ మంత్రి కేటీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కేలక్ష్మణ్ లు హాజరవుతున్నట్లు రాంనగర్ కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. లంబాడి తండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంకు మొదటి దశలోనే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌కు తండా ప్రజలు రుణపడి ఉంటారని ఆయన మాటల్లో వెల్లడించారు.