రాహుల్ ప్రశ్నకు ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి నఖ్వి

SMTV Desk 2017-12-03 17:18:19  Union Minister Mukhtar Abbas Naqvi, Comments on rahul gandi.

న్యూఢిల్లీ, డిసెంబర్ 03 : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీపై రోజుకో ప్రశ్న సంధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రాహుల్ గాంధీ తన ట్విటర్‌ ఖాతాలో తన ఐదవ ప్రశ్నగా మహిళలకు రక్షణ విషయమై ఒక ట్వీట్‌ చేశారు. ఈ విషయంపై భాజపా నేత, కేంద్ర మంత్రి ముఖ్తర్‌ అబ్బాస్‌ నఖ్వి స్పందిస్తూ.. రాహుల్‌కి రీ-కౌంటర్ ఇచ్చారు. "వంకాయకి-ఉల్లిపాయకి, బర్గర్‌కి-పిజ్జాకి తేడా తెలియని ఆయన ఇలాంటి ప్రశ్నలు వేయడమా.? ముందు ఏబీసీడీలు సరిగ్గా వస్తే దేశ రాజకీయాలు, సంస్కృతి గురించి తెలిసొస్తుంది" అని విమర్శించారు.