ఓయూలో విషాదం.. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య...

SMTV Desk 2017-12-03 17:18:19  osmania university, student sucide, unemployment issue.

హైదరాబాద్, డిసెంబర్ 03 : ఓయూలో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓయూలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న మురళి అనే విద్యార్ధి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిరుద్యోగం కారణంగానే మురళి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలుసుకున్న జేఏసీ చైర్మన్ కోదండ రామ్ ఓయూకు చేరుకొని వివరాలపై ఆరా తీశారు. ఆయన మృతితో ఓయూలో విషాద ఛాయలు అలుముకున్నాయి.