ప్రజలకు ఆంక్షలు విధించిన కిమ్ జాంగ్ ఉన్

SMTV Desk 2017-12-03 16:39:32  North Korean President Kim Jong Un, Restrictions to the people

ఉత్తరకొరియా, డిసెంబర్ 03 : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్షిపణి పరీక్షలతో అలజడి పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క విపక్ష దేశానికే కాకుండా ఇటీవల తమ దేశ ప్రజలను కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు దక్షిణకొరియా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆర్థిక ఆంక్షల బారిన పడిన ఉత్తరకొరియా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా, మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తన ప్రజలపై అధ్యక్షుడు కిమ్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారని సమాచారం. ఎంతగా అంటే ప్రజలు సమూహంగా ఏర్పడడాన్ని కూడా నిషేధించారు. మద్యం సేవించడం, పాటలు పాడడంపై కూడా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఈ నిషేధాజ్ఞలతో ప్రజలపై పట్టు సాధించడమే కాకుండా ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కునేందుకు కూడా దోహదపడతాయని కిమ్ భావిస్తున్నారని దక్షిణకొరియా నిఘా సంస్థ పేర్కొంది