పాన్‌-ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి...

SMTV Desk 2017-12-03 16:20:14  pan card, adhar card, government,

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 3: దేశ ఆర్ధిక వ్యవస్థకు నకిలీ పాన్ కార్డులు శ్రేయస్కరం కాదని భావించిన అధికారులు కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు అంగీకరిస్తే పాన్ కార్డును, ఆధార్ తో అనుసంధానం చేస్తే వీటిని నియంత్రించవచ్చని ప్రభుత్వాధికారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాన్‌ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ డిసెంబరు 31 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువును 2018, మార్చి 31 వరకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఒకవేళ నిర్ణీత తేదీ లోపు ఆధార్‌ను లింక్‌ చేసుకోకపోతే పాన్‌ను రద్దు చేయనున్నారు. దేశంలో 33కోట్ల మంది పాన్‌కార్డుదారులు ఉండగా, నవంబర్‌ వరకు 13.28కోట్ల మంది పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకున్నారు.