షాపింగ్ మాల్ ను ఆవిష్కరించిన హీరో వెంకటేశ్

SMTV Desk 2017-12-03 15:39:54  Hero Venkatesh, guntur, Shopping mall

గుంటూరు, డిసెంబర్ 03 : నేడు గుంటూరులోని లక్ష్మీపురంలో ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్‌ విచ్చేశారు. లక్ష్మీపురంలో కొత్తగా రూపొందించిన సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భాగం హీరో వెంకటేశ్ మాట్లాడుతూ... చాలా సంవత్సరాల తర్వాత గుంటూరు రావడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. ఈ ఏడాది గురు సినిమా తరువాత విరామం తీసుకున్నా, నూతన సంవత్సరంలో నాలుగైదు సినిమాలు చేసే అవకాశం ఉందన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.