సూపర్‌ సిరీస్‌ టెన్నిస్‌ చాంపియన్ సృజన...

SMTV Desk 2017-12-03 15:15:13  super series tennis, akhila bharatha tennis, under-14 girls group,

హైదరాబాద్, డిసెంబర్ 3: టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆదరగోట్టేసింది. అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) సూపర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో అండర్‌–14 బాలికల విభాగంలో సృజన రాయరాల టైటిల్ ను సాధించి విజేతగా నిలించింది. కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో సృజన 6–3, 6–2తో ప్రేరణ కోయిరాలపై విజయం సాధించింది. అండర్‌–16 బాలికల ఫైనల్లో సృజన చివరిదాకా పోరాడి పరాజయపాలైంది. 2–6, 5–7తో సీహెచ్‌ రితుజ చేతిలో ఓడిపోయింది.