చిరుత vs రేసు కారు...ఎవరు గెలుచారో తెలుసా!

SMTV Desk 2017-12-03 13:25:19   Formula - E race car, Leopard, dakshinafrika, Race

కేప్‌టౌన్, డిసెంబర్ 03 ‌: భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడే దృష్ట్యా ఫార్ములా-ఈ రేసు కారు ఓ ప్రయోజనంతో పోటీ పడేందుకు ముందుకు వచ్చింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఫార్ములా-ఈ రేసు కారుతో చిరుత పోటీ పడింది. అదెలానో వినండి..ఓవైపు చిరుత, మరోవైపు ఫార్ములా-ఈ రేసు కారు మధ్య పోటీ ప్రారంభమైంది. అయితే, ఈ రేస్ లో వాహనాన్ని నడిపేది, అనేక పోటీల్లో తన ప్రతిభ చూపిన రేస్‌డ్రైవర్‌ జీన్‌ ఎరిక్‌ వెర్గ్నే. క్షణాల్లోనే చిరుత వేగం పెంచి, కారును దాటిపోయి ముందుకెళ్లింది. దీంతో ఆ డ్రైవర్‌ కూడా వేగం పెంచడంతో, చివరకు ఎవరు గెలుస్తారోనని అక్కడున్నవారిలో ఆసక్తి రేకెత్తించింది. దక్షిణాఫ్రికా కేంద్రంగా జరిగిన ఈ పోటీలో కేవలం అంగుళం తేడాతో, చిరుత ఓడిపోయినా అది పెట్టిన పరుగుకు ప్రేక్షకుల రోమాలు నిక్క బోడిచాయి. ఈ వీడియో ఇప్పుడు విశేష ఆదరణ పొందుతోంది. కాగా, అంతరించిపోయే ప్రమాదంలో పడిన చిరుతల విశిష్టతను చాటిచెప్పేందుకే, ఈ రేసును చిరుతతో నిర్వహించారు.