మోదీపై ఘాటు ప్రశ్నను సంధించిన రాహుల్ గాంధీ..

SMTV Desk 2017-12-03 12:37:40  Rahul Gandhi question to Modi, gujarath elections rally.

న్యూఢిల్లీ, డిసెంబర్ 03 : గుజరాత్ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గడిచిన 22 సంవత్సరాల బీజేపీ పాలనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రోజుకో ప్రశ్న సంధిస్తానని ఇటీవల పేర్కొన్నారు. అనుకున్నదే తడవుగా మోదీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా తన ఐదవ ప్రశ్నగా రాష్ట్రంలో మహిళల భద్రత, సరైన విద్య, ఆరోగ్యంపై సరైన పాలనను అందించడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. ఈ విషయాలపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన రాహుల్.. అంగన్ వాడీ వర్కర్లు, ఆశా హెల్త్ వర్కర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని, వారికి ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాగా డిసెంబర్ 9న తొలివిడత ఎన్నికలు, 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.