తిరువీధులలో వరాహాల మంద

SMTV Desk 2017-12-03 12:27:40  thirupathi temple, Herd of pigs, TTD

తిరుపతి, డిసెంబర్ 03 : పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వరాహాలు యేదేచ్చగా సంచరిస్తున్నాయి. నిత్యం శ్రీవారి వాహన సేవాలు జరిగే పవిత్రమైన తిరుమాడ వీధుల్లో ఆలయ పరిసరాల్లో పందులు సంచారం ఎక్కువవుతుంది. తిరువీధుల్లో పాదరక్షణలనే నిషేధించిన తిరుమల తిరుపతి దేవస్థానం, పందుల సంచరాల్ని పట్టించుకోకపోవడాన్ని యాత్రికులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గతంలో కూడా భక్తులు డయల్‌ తితిదే ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కన్పించడం లేదు. శ్రీనివాసుడు విహరించే తిరువీధుల పవిత్రతను గుర్తించి ఇప్పటికైనా ఈ పందుల మంద పై తితిదే చర్యలు తీసుకోవాలని భక్తులు భావిస్తున్నారు.