అతలాకుతలమైన "శబరిమల"

SMTV Desk 2017-12-02 19:40:05  OKHI TUFAN, shabarimala, heavy rains, kerala government.

శబరిమల, డిసెంబర్ 02 : రాష్ట్రాన్ని వణికిస్తున్న "ఓఖీ తుఫాన్" దెబ్బకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. శబరిమల నదిలో ఇప్పుడిప్పుడే స్నానాలు చేయవద్దని సూచిస్తోంది. భారీ ఈదురుగాలుల ప్రభావానికి నడకదారి కూడా తీవ్రంగా దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో పక్క ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అధికారులు రాత్రి సమయాల్లో పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. ఈ తుఫాన్ ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది.