చట్ట గుర్తింపు లభించిన స్వలింగ వివాహం

SMTV Desk 2017-06-14 18:59:01  World Development,Colombiya,Marriage,victor Hugo prada

బగోటా, జూన్ 14 : ప్రపంచం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో నూతన విషయాలు తెలుస్తాయని అందరు భావిస్తారు. కాని పెళ్లిల విషయంలో కూడా అలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపడేలా, ప్రకృతికి విరుద్ధంగా కూడా పెళ్లి చేసుకోవచ్చా, అనే విధంగా.. కొలంబియాలో జరిగిన ఒక పెళ్లిని చూస్తే ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తుంది. గత సంవత్సరం కొలంబో దేశం... స్వలింగ సంపర్కుల వివాహానికి అధికారికంగా అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో తాజాగా ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడుతూ ‘మేము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నాం. మా హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నాం’ అని పేర్కొన్నాడు. ఇతను పెళ్లి చేసుకున్న ముగ్గురిలో ఒక వ్యక్తి.... కాగా తన జీవిత భాగస్వాములుగా స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, జర్నలిస్టు మాన్యూల్ జోన్ బెర్మాముండేజ్ ఉంటారని పేర్కొన్నాడు. తమ వివాహానికి సంబంధించిన లీగల్ పేపర్లపై మెడిలిన్ నగరానికి చెందిన అధికారి సమక్షంలో సంతకాలు జరిగాయన్నారు. ఇకపై తమ ఫ్యామిలీ యూనిట్‌కు న్యాయపరమైన గుర్తింపు లభించిందన్నారు. ప్రపంచంలోనే తమదే తొలి పాలియామర్ ఫ్యామిలీ అని పేర్కొన్నారు. న్యాయవాది, స్వలింగ సంపర్కుల పోరాటవాది జర్మన్ రికాన్ మాట్లాడుతూ కొలంబియాలో ముగ్గురు వ్యక్తుల యూనిట్‌లు చాలా ఉన్నాయని, అయితే ఇప్పుడు జరిగిన వివాహానికి అధికారిక గుర్తింపు దక్కిందన్నారు.