ఒబామాకు చేనేత వస్త్రాలు బహూకరించిన ఏపీ ప్రచారకర్త...

SMTV Desk 2017-12-02 15:12:32  barak obama, handloom dresses, poonam kour, andhrapradesh, brand ambassador

న్యూ డిల్లీ, డిసెంబర్ 02: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పూనమ్‌ కౌర్‌ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. చేనేత వస్త్రాలకు భారీ ప్రచారం కల్పించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ బాధ్యతను నటి పూనమ్‌ కౌర్‌ కు అప్పగించింది. తాజాగా భారత పర్యటనకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను న్యూ డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పూనమ్‌ కౌర్‌ కలిసి చేనేత వస్త్రాలు బహూకరించి౦ది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అందరికి ఆదర్శవంతమైన నాయకుడు బరాక్ ఒబామా అని, తను ఎంతో ఆదరించే ఆయన్ను కలిసి చేనేత వస్త్రాలు బహూకరించడం తన జీవితంలో మర్చిపోలేని రోజు అని ఆమె పేర్కొంది. ఆ వస్త్రాలను ఒబామా సతీమణి మిషెల్ కోసం అందించినట్లు పూనమ్ పేర్కొన్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు మంచి ప్రచారం లభించినట్లయ్యి౦దని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.