వైట్ హౌస్ లో బొద్దింక‌లు, ఎలుక‌లు, చీమ‌లు

SMTV Desk 2017-12-02 15:03:19   amerika white house, Cockroaches, ants,

వాషింగ్టన్, డిసెంబర్ 02 : అమెరికా అధ్యక్షుడి నివాసంలో వేల సంఖ్యలో బొద్దింక‌లు, ఎలుక‌లు, చీమ‌ల‌కు నిలయ‌మైన‌ట్లు తెలుస్తోంది. అధ్య‌క్షుడి అధికారిక నివాసంలోని దాదాపు నాలుగు చోట్ల, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ కార్యాల‌యంలో చీమ‌ల బెడ‌ద ఉన్న‌ట్లు తెలిసింది. అలాగే సిట్చువేష‌న్ గ‌దిలో, నావీ మెస్‌లో ఎలుక‌లు ఉన్న‌ట్లు డాక్యుమెంట్ల‌లో ఉంది. వీటితో పాటు వైట్ హౌస్ లో మిగ‌తా గ‌దుల నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌తు కోసం అధికారులు యూఎస్ జ‌న‌ర‌ల్ స‌ర్వీసెస్ అడ్మినిస్ట్రేష‌న్ (జీఎస్ఏ)కి వంద‌ల సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోనట్లుగా సమాచారం. వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న 9000ల‌కి పైగా ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్వ‌హ‌ణ‌ను జీఎస్ఏ ప‌ర్య‌వేక్షిస్తుంది. ఏజెన్సీ రికార్డుల ప్ర‌కారం వైట్‌హౌస్ మ‌రమ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం జీఎస్ఏ సంవ‌త్స‌రానికి ల‌క్ష డాల‌ర్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.