అమిత్ షా పై కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ విమర్శలు

SMTV Desk 2017-12-02 14:51:50  Congress leader Raj Babbar, comments on BJP national president Amit Shah,

న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అసలు హిందువే కాదని కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ ఆరోపించారు. అమిత్ షా ముంబైలోని జైన కుటుంబంలో పుట్టారని, ఆ తర్వాత వచ్చి గుజరాత్ లో సెటిలయ్యారని వ్యాఖ్యానించారు. జైన మత౦లో పుట్టిన ఆయన హిందువు ఎలా అవుతారని ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మతాల మధ్య గొడవ ప్రారంభమైన సందర్భానా రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కాగా నాన్ హిందూ డిక్లరేషన్ బుక్ లో సంతకం చేశారంటూ పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా రాజ్ బబ్బర్, అమిత్ షా పై విధంగా స్పందించారు.