"లవ్ జిహాద్" కు వ్యతిరేకంగా ఆరెస్సెస్ పోరాటం..!

SMTV Desk 2017-12-02 13:56:50  LOVE JIHAD, Hindu Jagran Munch, a subsidiary of the RSS, NEW DECISION.

న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : మతాంతర వివాహాలు జరిపించేందుకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ హిందూ జాగరణ్ మంచ్ (హెచ్‌జేఎం) ప్రణాళికలు రచిస్తోంది. హిందూ యువకులతో ముస్లిం యువతుల పెళ్లిళ్లు జరిపించడం కోసం "లవ్ జిహాద్" కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇందు నిమిత్తం "బేటీ బచావో, బాహు లావో" (ఆడపిల్లలను రక్షించు.. కోడళ్లను తీసుకురా) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇలా మతాంతర వివాహాలు చేసుకునే వారికి అండగా నిలిచి వారికి రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో మొత్తం 2100 ముస్లిం యువతుల వివాహాలు జరిపించి, అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించనున్నారు.