ట్రిపుల్ తలాక్ చెప్తే మూడేళ్ళ జైలు...

SMTV Desk 2017-12-02 13:39:43  Triple talaq, new rules issued by central government, three years arrested, parliament bill

న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : ట్రిపుల్ తలాక్ విషయంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి చిన్న విషయానికి తలాక్ చెప్పి భార్యల నుండి విడాకులు తీసుకు౦టున్న నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇక నుండి ట్రిపుల్ తలాక్ చెప్పే వారిని జైలుకు పంపే దిశగా చర్యలు చేపట్టింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ విషయానికి సంబంధించి బిల్లును తీసుకురానున్నారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది ఒక చట్టంగా రూపాంతరం చెందితే "ట్రిపుల్ తలాక్" ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఈ విషయంపై ఆమోదం లభిస్తే ఒక జమ్మూకశ్మీర్ మినహా ఈ చట్టం దేశమంతా అమల్లోకి రానుంది.