జీఈఎస్ సదస్సుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇరు దేశాధినేతలు

SMTV Desk 2017-12-02 11:30:12  GES meeting, Successful meet, modi, trump phone call

న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిమిత్త౦ ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ విచ్చేసిన విషయం తెలిసిందే. నవంబర్‌ 28న జరిగిన ఈ జీఈఎస్ సదస్సు విషయమై ప్రధాన మంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిరువురు జీఈఎస్ సదస్సు విజయవంతం కావడంపై ఫోన్ లో సంభాషించుకున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. కాగా మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.