పళనిస్వామికి మోదీ ఫోన్.. "ఓఖీ" తుఫాన్ పై ఆరా...

SMTV Desk 2017-12-02 11:30:12  OKHI TUFAN, PRESIDENT MODI, TAMILNADU CM PALANISWAMY,

చెన్నై, డిసెంబర్ 02 : తమిళనాడులో "ఓఖీ" తుఫాన్ భీభత్స౦ సృష్టిస్తోంది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. జిల్లాలో మొత్తం చీకటి రాజ్యమేలుతోంది. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ "ఓఖీ" తుఫాన్ కారణంగా పలు జాగ్రత్తలు పాటించాలని, రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. కాగా ఈ వర్షాల ధాటికి ఇప్పటికే కన్యాకుమారిలో 10 మంది మృతి చెందగా, చేపల వేటకు వెళ్లిన 30 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. రానున్న మరో 24 గంటలపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.