అమృత జయలలిత కూతురే : జయ స్నేహితురాలు గీత

SMTV Desk 2017-12-02 11:30:12  Tamil Nadu Late CM Jayalalitha, shobhan babu, daughter amrutha,

చెన్నై, డిసెంబర్ 02 : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె విషయంపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. నేను జయలలిత కూతురినే అంటూ ఇటీవల అమృత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జయలలిత స్నేహితురాలు గీత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమృత.. నటుడు శోభన్ బాబు, జయలలితల కూతురేనని తెలిపారు. ఈ విషయం జయ నెచ్చెలి శశికళకు కూడా తెలుసన్నారు. గతంలో తానూ శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకో కుమార్తె ఉందని, ఆమె పేరు అమృత అని శోభన్ బాబు స్వయంగా చెప్పినట్లు గీత గుర్తు చేసుకున్నారు. ఇక అమృత జయ కూతురే అన్న విషయం డీఎన్ఏ పరీక్షల్లో తేలుతుందని పేర్కొన్నారు.