అభివృద్ధే దేశానికి నిదర్శనం :ప్రధాని మోదీ

SMTV Desk 2017-12-01 18:03:35  utharapradhesh elections, modi compliments, twitter

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 01 : ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తాజాగా వెల్లడై, భాజపా విజయాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా బీజేపీ పై హర్షం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు. ‘యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల అభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేసేలా ఈ విజయం మనకు స్ఫూర్తినిస్తుందని, ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. దేశం మరోసారి అభివృద్ధి వైపే నడిచిందని ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు.