అమేథిలో కాంగ్రెస్‌పై భాజపా విజయం

SMTV Desk 2017-12-01 17:21:04  BJP, Congress, Amethi City Panchayat, elections

అమేథి, డిసెంబర్ 01 : గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ ను భాజపా ఓడించింది. అమేథి నగర పంచాయతీలో కాంగ్రెస్‌పై భాజపా అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు మేయర్‌ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ వెనుకంజలో ఉంది. అలహాబాద్‌ మేయర్‌ స్థానాన్ని కూడా భాజపా కైవసం చేసుకుంది. భారీ గెలుపు దిశగా భాజపా 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిలో 16 నగర నిగమ్‌లు, 198 నగరపాలిక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి. అయితే, చాలా స్థానాల్లో భాజపా ముందంజలో ఉంది. 16 మేయర్‌ స్థానాల్లో ఇప్పటికే కొన్నింటిలో భాజపా విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా విజయం దాదాపు ఖరారైపోవడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.