డబ్బు గురించి నేనెప్పుడు ఆలోచించలేదు: ముకేష్ అంబానీ

SMTV Desk 2017-12-01 17:07:12  mukesh ambani, ril head, ht leader ship, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆధినేత ముకేష్ అంబానీ హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఇండియా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వంటి విషయాలతో పాటు తన వ్యక్తిగత అంశాలు కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖేశ్‌ అంబానీ మాట్లాడుతూ " ప్రస్తుత భారత్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులేస్తుందని, వచ్చే 20 సంవత్సరాల నాటికి ఇండియా ఆర్ధిక వృద్ధి 5 ట్రిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుందని నా అంచనా. అందుకు తగ్గట్టు మన దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. నేను డబ్బు మనిషిని కాదు. నాకు సంబంధించిన వరకు వనరులే ముఖ్యం. నేను బయటకు వెళ్లిన డబ్బు తీసుకెళ్లను. నాకు క్రెడిట్‌ కార్డు కూడా లేదు. మరొకరు నా డబ్బులు చెల్లిస్తారు " అని వ్యాఖ్యానించారు.