మోదీకి నిస్సాన్ లీగల్ నోటీసులు

SMTV Desk 2017-12-01 16:58:19  Nissan notices, India, japan, central government,

న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : భారత్ పై జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ మోటార్స్‌ రూ. 5వేల కోట్లకు దావా వేసింది. అసలేం జరిగిందంటే.. తమిళనాడులో తొమ్మిదేళ్ల క్రితం నిస్సాన్‌ కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో పన్ను రీఫండ్‌తో సహా పలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు నిస్సాన్‌, తమిళనాడు ప్రభుత్వం ల మధ్య ఒప్పందం కుదిరినా, తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదని నిస్సాన్‌ చెబుతోంది. దీనికి సంబంధించి గతేడాదే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లీగల్‌ నోటీసులు కూడా జారీ చేశార‌ట‌. అయిన ఫలితం లేక, ఈ కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను నిస్సాన్‌ కోరింది. దీంతో గతేడాది జులైలో ప్రధాని మోదీకి లీగల్‌ నోటీసులు జారీ అవగా, బకాయిలు తప్పకుండా చెల్లిస్తామని దీన్ని లీగల్‌ కేసు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. కానీ నిస్సాన్‌ మాత్రం ఈ వ్యవహారంలో మద్యవర్తిని నియమించుకోవాలని భారత్‌కు ఆల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించిన విచారణ డిసెంబర్‌ రెండో వారంలో చేపట్టనున్నారు.