హైదరాబాదీ బిర్యానీకి ఢిల్లీలో పురస్కారం

SMTV Desk 2017-12-01 16:09:40  Adimahotsav awards, Union Minister Julel Oormum, hyderabad biryani, delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : ఢిల్లీలో గిరిజన సంక్షేమశాఖ నిర్వహిస్తున్న ‘ఆది మహోత్సవ్‌’ కార్యక్రమ వంటకాల్లో హైదరాబాద్‌ బిర్యానీ తొలిస్థానం పొందింది. దేశవ్యాప్తంగా గిరిజనుల కోసం కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మొత్తం 29 రాష్ట్రాలు పక్షం రోజులుగా వారి రుచులను ఢిల్లీహత్ లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి హైదరాబాద్‌ బిర్యానీ స్టాల్‌ను అశోక్‌కుమార్‌ రమావత్‌ ఏర్పాటుచేశారు. అన్నిరాష్ట్రాల వంటకాల్లోనూ హైదరాబాద్‌ ధమ్‌ బిర్యానీ తొలిస్థానంలో నిలిచింది. కాగా, ఈ వంటకాన్ని మెచ్చిన కేంద్రమంత్రి జుయెల్‌ఓరమ్‌ అశోక్‌ కు ‘ఆదిమహోత్సవ్‌’పురస్కారం అందించారు.