ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు

SMTV Desk 2017-12-01 15:25:34  Maharashtra Education Minister Vinod Thawade, anantapuram, parlament meeting

అనంతపురం, డిసెంబర్ 01 : నేడు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భాజపా ముఖ్యనేతలతో మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్‌ థావడే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లా కుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అంశంపై స్పందించిన థావమే, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోదన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. చిత్తూరు, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను తనకు అప్పగించినట్లు వెల్లడించారు. కాగా, ఈ నెల 2న హిందూపురం పార్లమెంటు పరిధిలోని నాయకులతో వినోద్‌ థావడే భేటీ కానున్నారు.