ఒబామా దాల్‌ రెసిపీ, కీమా చాలా బాగా చేస్తారట

SMTV Desk 2017-12-01 14:23:01  Former President Barack Obama visited, India, delhi, Dahl recipe, keyma cooking Obama

న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు పాతీలు చేయడం చాలా కష్టమట, ఢిల్లీ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ... అధ్యక్షుడిగా పదవి కాలం ముగిసిన అనంతరం వంటలు చేయడం నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. దాల్‌ రెసిపీ, కీమా చాలా బాగా చేస్తానని చెప్పారు. కానీ చపాతీలు చేయడం మాత్రం రాలేదని చెప్పారు. వాటిని చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన తన సమయాన్ని ఎక్కువగా కుటుంబానికి కేటాయిస్తూ వచ్చారు. తన కుమార్తెను మొదటి రోజు కాలేజీలో చేర్పించిన క్షణాలను ఆయన ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను కూడా ట్విటర్‌లో గతంలో పోస్టు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని టౌన్‌హాల్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం ఒబామా జర్మనీ, ఇండోనేషియా, బ్రెజిల్‌లో కూడా పర్యటించనున్నారు.