మరోసారి క్రాష్ అయిన వాట్సాప్..

SMTV Desk 2017-12-01 13:17:25  wts app, crash, social media complaints, wts app staff.

న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరోసారి క్రాష్ అయింది. తమ వాట్సాప్ పని చేయడం లేదంటూ ఇప్పటికే పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. కాగా గతంలో కూడా ఇదే మాదిరి క్రాష్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ తాజా పరిణామంతో సుమారు గంట పాటు ఈ వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. ఈ సమస్య ఉత్తర యూరప్, బ్రెజిల్ లలో ఎక్కువగా ఉండగా, భారత్ లో కూడా పలువురు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధులు వాట్సాప్ లో అంతరాయ౦ ఏర్పడిందని, సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ సమస్య ఎందుకు తలెత్తిందో గుర్తించే పనిలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.