భారీ వర్షంతో 105 మంది మృత్యువాత

SMTV Desk 2017-06-14 16:12:36  Bangladesh,Rain,Rangamati district

ఢాకా, జూన్ 14 : బంగ్లాదేశ్ లో బుధవారం వేకువ జామున కురిసిన భారీ వర్షం దాటికి కొండా చరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతమైన రంగమతి జిల్లాలో అధిక ప్రాణ నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి సహాయక చర్యలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దాదాపు 75 మరణాలు ఈ ఒక్క జిల్లాలోనే సంభవించాయి. మృతుల్లో ఓ మేజర్‌, ఓ కెప్టెన్‌ సహా నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. రంగమతిని చిట్టగాంగ్‌ను కలుపుతూ ఉన్న ప్రధానరహదారిపై పేరుకున్న రాళ్లు, రప్పల తొలగింపు చర్యల్లో పాల్గొంటుండగా.. కొండ చరియలు విరిగిపడి వీరు మృతి చెందినట్లు సైన్యం ప్రతినిధులు తెలిపారు. ఇటు చిట్టగాంగ్‌లోని రంగునియా, చందానైష్‌ ఉపజిల్లాల్లో కొండచరియలు విరిగిపడి.. 23 మంది చనిపోయినట్లు పత్రికలు తెలిపాయి. బందర్బన్‌లోనూ ఇదే తరహా ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందినట్లు పేర్కొన్నాయి. దాదాపు 100 మందికిపైగా గాయాలపాలయ్యారని.. మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపాయి. విద్యుదాఘాతానికి గురవడం, నీటిలో మునగడం తదితర సంఘటనల్లో కొందరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.