పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం

SMTV Desk 2017-11-30 17:14:50  ap assembly meeting, 8 Bills issued, chandrababu naidu.

అమరావతి, నవంబర్ 30 : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. 2013 భూసేకరణ చట్టానికి 12 సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.. ఏపీ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి బిల్లు, ఏపీ పౌర సేవల హామీ బిల్లు, వర్సిటీల్లో నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ రూపొందించిన బిల్లులకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు భూసేకరణ, పునరావాస పరిహార పారదర్శకత హక్కు సవరణ బిల్లు, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ రెండో సవరణ, వడ్డీ వ్యాపారుల నియంత్రణ, ఏపీ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌, ఏపీ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ వంటి బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.