కొత్త సంవత్సరంలో రజనీకాంత్ రాజకీయ ప్రకటన :సత్యనారాయణ రావు

SMTV Desk 2017-11-30 14:55:56  Superstar Rajinikanth, Brother Satyanarayana Rao, media, chennai

చెన్నై, నవంబర్ 30 : ఇటీవల జరిగిన 2.0 ఆడియో వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం వార్తను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడే రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత లేదని వెల్లడించగా, ఇంతలోనే బుధవారం తమిళనాడులోని ధర్మపురిలో రజనీ అభిమానుల సంఘం జిల్లా కార్యదర్శి కుమారుడి వివాహానికి రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...రజనీకాంత్‌ జనవరిలో పార్టీ ప్రకటన చేస్తారని, ప్రజలే దీనిపై నిర్ణయించుకోవాలన్నారు. వచ్చే ఏడాది మే నెలలో యుద్ధానికి సిద్ధంగా ఉండండని అభిమానులతో రజనీకాంత్‌ పేర్కొన్నారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని అనేక మంది ప్రకటించారు. 2.0 ఆడియో వేడుకల్లో కూడా ఒక కోరిక ఇంకా మిగిలుందని రజనీకాంత్‌ తెలిపారు. ఇదే నేపథ్యంలో ఆయన సోదరుడు జనవరిలో పార్టీ ప్రకటన చేస్తారానటం మరోసారి దీనిపై చర్చనీయంశామైంది.