జమ్మూకశ్మీర్ లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం...

SMTV Desk 2017-11-30 14:53:50  JAMMU KASHMIR, terrarist attack, jaishe mahammad terrarist.

జమ్మూకశ్మీర్, నవంబర్ 30 : జమ్మూకశ్మీర్ లో మరోసారి సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల మోత మోగుతోంది. ఉగ్రవాదులు ఒక ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో భారత సైనికులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన బాడ్గం అనే ప్రాంత౦లో చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టినట్లు తెలుస్తోంది. వీరంతా జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారని భద్రతాదళాలు వెల్లడించాయి. మరోవైపు బారాముల్లా సోహోర్ ప్రాంతంలో భారీగా ఉగ్రవాదుల కదలికలను గమనించిన సైన్యం వారిపై కాల్పులు జరుపగా, ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.