మైక్‌ అనుకుని టార్చ్‌లైట్‌ తో ప్రసంగం

SMTV Desk 2017-11-30 14:24:24  West Bengal Chief Minister Mamata Banerjee, Mike, torchlight, Netijanlu, social media

కోల్‌కత్తా, నవంబర్ 30 : ఈ నెల 29న కోల్‌కతాలో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడానికి మైక్‌ అనుకుని అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలోని టార్చ్‌లైట్‌ తీసుకుని ప్రసంగించబోయారు. ఆ టార్చ్‌లైట్‌ ఆన్‌చేసి ఉండడంతో మమత ముఖంపై లైట్‌ పడిన దృశ్యం మీడియా కంటపడింది. వెంటనే దాన్ని గమనించిన గార్డు ఆమె చేతిలోని టార్చ్‌లైట్‌ తీసుకుని మైక్‌ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు మమతకు టార్చ్‌లైట్‌ని మైక్‌గా మార్చే పవర్‌ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.