రెండాకుల గుర్తుపై ఆగని వర్గపోరు

SMTV Desk 2017-11-30 12:36:46  Palani-panir selvam, dinakaran, chennai election, high court, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 30 : రెండాకుల గుర్తుపై అన్నాడీఎంకేలో వర్గపోరు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. దీంతో పళని-పన్నీర్‌ వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడాన్ని శశికళ మేనల్లుడు దినకరన్‌ వ్యతిరేకిస్తూ, ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండాకుల గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ గుర్తును తమకే కేటాయించాలంటూ పళని-పన్నీర్‌ వర్గం, దినకరన్‌ వర్గం ఎన్నికల సంఘాన్ని కోరాయి. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ కొన్ని వాయిదాల అనంతరం ఎట్టకేలకు పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తును కేటాయిస్తున్నట్లు ఇటీవల తమ ప్రకటనను తెలిపింది. ఈ మేరకు అన్నాడీఎంకేలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది.