దొంగ చాటుగా వచ్చి ...దొరికిపోయాడు

SMTV Desk 2017-11-30 12:07:47  asian kabbadi champion ship, iran, thailand, coach entry,

ఇరాన్, నవంబర్ 30 : ఇరాన్‌లోని జ‌రుగుతున్న ఆసియ‌న్ క‌బ‌డ్డీ ఛాంపియ‌న్‌షిప్ లో ఒక వింత సన్నివేశం చోటు చేసుకుంది. మ‌హిళ‌ల‌ ఆట‌ను చూసేందుకు థాయ్‌లాండ్ జ‌ట్టు కోచ్ ప్ర‌య‌త్నించాడు. అదేంటి ఆట చూస్తే తప్పేముంది అనుకుంటున్నారా...? ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్ నిబంధ‌న‌ల ప్ర‌కారం మ‌హిళ‌లు ఆడుతున్న ప్ర‌దేశానికి మ‌గ‌వాళ్ల‌ను, మీడియాను లోపలికి అనుమ‌తించ‌రు. కానీ థాయిలాండ్ కోచ్ ఎవరికీ కన్పించకుండా ఉండేదుకు బుర్ఖా వేసుకుని స్టేడియం లోప‌లికి ప్రవేశించాడు. ఇది గమనించిన యాజమాన్యం కోచ్ వైఖరిపై మండిపడింది. ఈ విషయం పై స్పందించిన కోచ్ తమ జట్టుకు ఆటలో భాగంగా సలహాలు, సూచనలు ఇచ్చేందుకే లోపలకి వెళ్లనని చెప్పారు.