బంగాళాఖాతంలో అల్పపీడనం..

SMTV Desk 2017-11-30 12:04:11  chennai weather report, The low pressure in the Bay of Bengal

చెన్నై, నవంబర్ 30 : తమిళనాడులో వరుణుడి తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్షాల ధాటికి నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది. నైరుతి బంగాళాఖాతంలో వున్న అల్పపీడనం బుధవారానికి వాయుగుండంగా మారి తీరం దాటింది. ఈ నేపథ్యంలో అల్పపీడన ద్రోణి దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనంగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రానున్న 24 గంటల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది గాలుల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతో౦ది. బుధవారం నాటికి ఆదిలాబాద్‌లో ఏడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.