తెలంగాణ సమగ్ర సమాచారంతో పుస్తకం విడుదల

SMTV Desk 2017-11-30 11:39:22  statastical year book, telangana, unemployers, state beuro of telangana

హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు పోటీపడే నిరుద్యోగులకు శుభవార్త. కొత్త జిల్లాల సరైన సమాచారం లేక ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్రంలోని 31 జిల్లాల సమగ్ర సమాచారంతో రాష్ట్ర బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ శాఖ స్టాటిస్టికల్ ఇయర్ బుక్-2017ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 చాప్టర్లతో ఉన్న ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన సమాచారాన్ని పొందుపరిచారు. జనాభా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వాతావరణం, వ్యవసాయం, నీటిపారుదలరంగం, అడవులు, పరిశ్రమలు, ఖనిజాలు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్స్, రాష్ట్ర ఆర్థిక ప్రగతి తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. 85 శాఖలకు సంబంధించిన గణాంకాలను, టేబుళ్లను ఇందులో చేర్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లోగల అర్థగణాంకశాఖ కార్యాలయంలో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. సమగ్ర సమాచారంతో పుస్తకం బాగుందని నిరుద్యోగులు వ్యాఖ్యానించారు.