ప్రధాని థెరిసా మే, నాపై దృస్టి పెట్టడం మానండి :ట్రంప్

SMTV Desk 2017-11-30 11:14:36  American President Donald Trump, The Prime Minister of Britain is Theresa, comment, twitter

వాషింగ్టన్, నవంబర్ 30 ‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై బ్రిటన్ ప్రధాని థెరిసా మే విమర్శలు చేశారు. ఇంతకీ ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రిటన్‌ ఫస్ట్‌ అనే జాతీయవాద గ్రూపు డిప్యూటీ లీడర్‌ జైడా ఫ్రాన్సెస్‌ ఇటీవల తన ట్విటర్‌ ఖాతాలో మూడు వీడియోలను పోస్టు చేశారు. ముస్లిం వలసదారులు ఓ చిన్నారిని కొట్టడం, వర్జిన్‌ మేరీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఓ టీనేజీ కుర్రాడిని ముస్లిం యువత కొట్టి చంపడం, ఇవి ఆ మూడు వీడియోల సారాంశాలు. వీటిని ట్రంప్‌ బుధవారం రీట్వీట్‌ చేశారు. దీంతో ట్రంప్‌ రీట్వీట్లపై థెరిసా విమర్శలు చేశారు. అలాంటి వీడియోలను ట్రంప్‌ తన ట్విటర్‌ ఖాతాలో రీట్వీట్‌ చేసి వాటికి ప్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదని థెరిసా అన్నారు. ఇందుకు స్పందించిన ట్రంప్ వెంటనే థెరిసాపై ప్రతి విమర్శలకు దిగారు. ‘ప్రధాని థెరిసా మే, నాపై దృస్టి పెట్టడం మానండి. యూకేలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఉగ్రవాదంపై ముందు దృష్టిపెట్టండి. మేం బాగానే ఉన్నామని ఆయన ట్వీట్‌ చేశారు.