బీసీసీఐకు షాక్ ఇచ్చిన సీసీఐ

SMTV Desk 2017-11-30 10:37:45  bcci, cci fine, broad cast rights, ipl league

న్యూఢిల్లీ, నవంబర్ 30 : ప్రపంచ క్రికెట్ ను తన కను సైగలతో శాసించే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కు, కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) షాక్ ఇచ్చింది. మీడియా రైట్స్‌ గుత్తాధిపత్య౦ పై అసంతృప్తిగా ఉన్న సీసీఐ రూ. 52.24 కోట్లు జరిమానా కట్టాలని బీసీసీఐని ఆదేశించింది. ఐపీఎల్‌ ప్రసార హక్కుల విషయంలో బోర్డు ఏకంగా పదేళ్ల హక్కులను ఒక్క మీడియా (సోనీ) సంస్థకే కేటాయించడం వల్ల మిగతా బ్రాడ్‌కాస్టర్లు పోటీపడే అవకాశాల్ని కోల్పోయారని ఉత్తర్వులో వెల్లడించింది. గత మూడేళ్ల బోర్డు ఆదాయం నుంచి సుమారు 4.48 శాతాన్ని జరిమానాగా కట్టాలని 44 పేజీల ఉత్తర్వులో సీసీఐ పేర్కొంది.